మున్సిపల్ లో జయశంకర్ జయంతి
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ సిద్ధార్థ స్వర్గీయ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, కమిషనర్ రవిబాబు కౌన్సిలర్లు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అవిశ్రాంతంగా పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయమని, వారి ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మారుతీ ఏఈ శేఖర్, పర్యావరణ అధికారి రజిని,కౌన్సిలర్లు,మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.






