23 August, 2026 | 8:28 PM

Breaking News

ప్రభుత్వగిరిజన బాలికల హాస్టల్ లో బోనాల పండుగ   •   దమ్మాయిగూడ–నాగారం 100 ఫీట్ల రోడ్డును 80 ఫీట్లకు కుదించాలి   •   యూరియా కొరత లేదు.... రైతులు ఆందోళన చెందొద్దు   •   శ్రీ రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవార్ల ఉపాలయాల ప్రతిష్ఠా మహోత్సవం   •   మానసిక వికలాంగ విద్యార్థులకు భోజన వితరణ   •   అమ్మవార్ల దయ జవహర్ నగర్ ప్రజలపై ఉండాలి   •   మైనార్టీ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అండ   •   ముత్యాలమ్మకి బోనం సమర్పించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి   •   రోడ్డు ప్రమాద బాధితున్ని పరామర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే   •   సొంత నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం అభినందనీయం: ఎమ్మెల్యే గూడెం   •  

పీఎం విశ్వకర్మపై కలెక్టర్‌సమీక్ష

13-11-2024 12:33 AM

దరఖాస్తుల వెరిఫికేషన్‌ను వేగవంతం చేయాలని ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన  పీఎం విశ్వకర్మ దర ఖాస్తుల వెరిఫికేషన్‌ను త్వరగా పూర్తిచేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ పథకంపై అధికారులతో నిర్వ హించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం విశ్వకర్మ పథకం కోసం జిల్లాలో 19,206 మంది దరఖాస్తు చేసుకోగా..

ఇప్పటివరకు కేవలం 236 మందికే రుణాలు అందించడం పట్ల అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా దరఖాస్తులకు సబంధించి 15 రోజుల్లోగా వెరిఫికేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశఃలో జీఎండీఏసీ ప్రవీణ్, డిబీసీడబ్ల్యూవో ఆశన్న, ఎల్‌డీఎం సుబ్రమణ్యం, ఎం. శ్రీనివాస్, ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ వినోద్‌యాదవ్, ఉషేకల పాండు పాల్గొన్నారు.