calender_icon.png 15 November, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొకాకోలా ఫ్యాక్టరీని సందర్శించిన కలెక్టర్

01-12-2024 02:03:18 AM

రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం

గజ్వేల్, నవంబర్30: సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాపూర్‌లో నూతనంగా నిర్మించిన హిందూస్థాన్ లీవర్ కోకాకోలా ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్ మనుచౌదరి శనివారం సాయంత్రం పరిశీలించారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులతో ఏర్పాట్ల గురించి చర్చించారు.

హెలీ ప్యాడ్  ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, డీపీవో దేవకీ దేవి, జిల్లా ఉద్యానవన అధికారి సువర్ణ, డీపీఆర్‌వో రవికుమార్, టీజీఐఐసీ జోనల్ అధికారి అను రాధ, డిప్యుటీ జోనల్ అధికారి జ్యోతి, ములుగు తహసీల్దార్ ప్రవీణ్  న్నారు.