calender_icon.png 15 November, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం

01-12-2024 02:01:22 AM

కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్

కామారెడ్డి, నవంబర్ 30 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కుట్రపన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ పేరుతో ప్రభు త్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు ఆరోపించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గురుకులాల్లో కల్తీ ఆహారంపై కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపిం చారు.

ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ చూసి బీఆర్‌ఎస్ అంతరించిపోతుందనే భయంతోనే కాంగ్రెస్ పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యావవస్థపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. దీన్ని దెబ్బతిసి ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు విద్యార్థుల్లో ఆత్మస్థుర్యైన్ని దెబ్బతిసేందుకు బీఆ ర్‌ఎస్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భారీ కుట్ర పన్నారని మండపడ్డారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, పట్టణ యు వజన అధ్యక్షుడు గడుగుల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొనె శ్రీనివాస్, లీగల్ సెల్ అధ్యక్షుడు దేవరాజ్‌గౌడ్, కౌన్సిలర్ ప్రసాద్, యువజన కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ పంతులు పాల్గొన్నారు.