8 April, 2026 | 8:44 AM

ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

05-11-2025 12:56 AM

నిజామాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి) :  జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు.

ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించారు.  ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.