calender_icon.png 5 November, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలి

05-11-2025 12:55:21 AM

కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి 

నిజామాబాద్, నవంబర్ 4 (నవంబర్) : గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా 2002 ఓటరు జాబితాతో, ప్రస్తుత ఓటరు జాబితాను మ్యాపింగ్ చేయడం జరుగుతోందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు తోడ్పాటును అందిస్తూ ఓటరు జాబితా పక్కాగా రూపొందేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లకు నియోజకవర్గ స్థాయిలో పోలింగ్ బూత్ ఏజెంట్ లను నియమిస్తూ, బూత్ లెవెల్ లో కూడా ఏజెంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 11వ తేదీ వరకు బీ.ఎల్.ఏ ల నియామకాలను పూర్తి చేయాలని అన్నారు.

పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లను జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు. డ్రాఫ్ట్ రోల్ లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పరిశీలించి సవరించడం జరుగుతుందన్నారు. కాగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ అవసరం ఉన్న చోట పోలింగ్ కేంద్రాలను విభజించడం, కొత్త వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాంటి పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తే, వాటి వివరాలను తమ దృష్టికి తేవాలని సూచించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, విజయేందర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.