calender_icon.png 5 November, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్మథ్‌స్వామిని దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే

05-11-2025 12:58:08 AM

బిచ్కుంద, నవంబర్ 4 (విజయ క్రాంతి): జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోమవారం నియోజకవర్గ పర్యటన ముగించుకున్న అనంతరం తన అనుచరులతో కలిసి మన్మథ్ స్వామి దర్శనానికి కపిల్ దార్ కు బయలుదేరారు..భక్తులతో కలిసి కపిల్ దార్ కు పాదయాత్రగా వెళ్తున్న సద్గురు సోమాయప్ప ని మార్గమధ్యలో కలిసి పూజలు నిర్వహించి సోమాయప్ప  ఆశీర్వాదం తీసుకొని వారితో కలిసి కొద్ది దూరం పాదయాత్రలో పాల్గొన్నారు..

అనంతరం కపిల్ దార్ కు చేరుకొని మన్మథ్ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అయన వెంట ఓబీసీ రాష్ట్ర నాయకుడు సాయి పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాలుగోన్నారు.