calender_icon.png 14 August, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీల ఆందోళనతో హోరెత్తిన కలెక్టరేట్

14-08-2025 12:45:11 AM

  1. కేసీఆర్ మారినా మా 2G సెల్ మార్చరా

రేవంతన్నఅంటూ కేసీఆర్ ఇచ్చిన సెల్ ఫోన్స్ కలెక్టరేట్ ఎదుట పోసి బతుకమ్మ అట పాటలు

పాడిన అంగన్వాడీలు

2G సెల్ వద్దు 5G సెల్ కావాలి 

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ డిమాండ్

10 రోజుల్లో కొత్త సెల్ అందిస్తాం: పీడీ లెనినా

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 13, (విజయక్రాంతి) అంగన్వాడీ సెంటర్స్ లో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ పై ఎఫ్ ఎస్ ఆర్. పేరుతో ఈకే్విసి, ఆధార్ లింక్ పేరు తో యు ద్ధ ప్రాతిపదికన అప్ లోడ్ చేయాలని, పై అధికారులు వత్తిడి తెచ్చి ఇబ్బందులు పెడుతున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కా ర్యదర్శి నరాటి ప్రసాద్ ఆరోపించారు.బుధవారం భద్రాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్స్ ఆందోళన చేపట్టారు.

గత కెసిఆర్ ప్రభుత్వం హయం లో ప్రతి అంగన్వాడీ టీచర్ కి 2G సెల్ పొన్స్ ఇచ్చారు, 10 ఏళ్ల నుంచి సెల్ వాడకం తో ప్రస్తుతం అన్ని సెల్ లు మూలాన పడ్డాయ ని, ప్రభుత్వం మారినా నూతన  5జి స్పీడ్ తో నెట్ వర్క్ సెల్స్ అందుబాటులోకి వచ్చి న,అంగన్వాడీ టీచర్లు కు కొత్త సెల్ ఫోన్ లు సరఫరా చేయక పోవడం, కొత్త యాప్స్ లేక పోవడం తో తాము ఎలా పని చేయ్యాలని వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులు, గ్రా మీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్య. ఆధార్ ఓటీపీ నంబర్స్ మ్యాచ్ కాకపోవటమ్ తో అ నేక ఇబ్బందులు వస్తున్నాయని, తక్షణం FRS ను రద్దు చెయ్యాలనీ డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్స్. బిఎల్ ఓ డ్యూటీ లు రద్దు చెయ్యాలి అని. ఎన్నికలు ముందు హామీ ప్రకారం రూ 18 వేలు వేతనం అమలు చె య్యాలన్నారు.

సమస్యలు తో కూడిన వినతి పత్రంను ఏవోకి అందించారు. ఈ సందర్భంగా పిడి లేనినా మాట్లాడుతూ పది రోజు ల్లో కొత్త సెల్ ఫోన్లు సరఫరా చేస్తానికి చర్య లు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమం లో రైతు సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాధం. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే జమలయ్య. అంగన్వాడీ అసోసియేషన్ జిల్లా నాయకులు గోనే మణి. రెడ్డి అరుణ. భూక్యా లలిత. విజయ, ఇంద్ర, సం ధ్య, రత్న కుమారి. చిన్నారి. సరోజ, వినోద, తదితరులు పాల్గొన్నారు.