calender_icon.png 19 October, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజధానిలో బంద్ సంపూర్ణం

19-10-2025 01:01:30 AM

డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

  1. మూతపడ్డ విద్యాసంస్థలు, దుకాణాలు

పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలు

పార్టీలకతీతంగా పాల్గొన్న నేతలు, మంత్రులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం హైద రాబాద్‌లో నిర్వహించిన బంద్ విజయవంతమైంది.

ఆర్టీసీ బస్సు లు డిపోలకే పరిమితం కాగా, విద్యాసంస్థలు, వ్యాపార సముదాయా లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. పార్టీలకతీతంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నేతలు బంద్‌లో పాల్గొని బీసీల ఆకాం క్షకు మద్దతు తెలిపారు. 

బీసీలది న్యాయమైన డిమాండ్: మంద కృష్ణ మాదిగ

42 శాతం బీసీ రిజర్వేషన్ల డిమాండ్ అత్యంత న్యాయమైనదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శనివారం ఎంజీబీఎస్ వద్ద నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ఉన్న జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు అతి తక్కువ రిజర్వేషన్లు పొందుతున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు జనా భా ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయి,

అగ్రకుల పేదలకు కూడా వారి జనాభాకు మించి ఈడబ్ల్యూఎస్ కోటా అమలవుతోంది. అలాంటప్పుడు బీసీలకు వారి న్యాయమైన వాటా ఎందుకు ఇవ్వరు? అని ఆయన ప్రశ్నించారు. తమిళనాడులో 50శాతం బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని, దానిని 9వ షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగబద్ధత కల్పిం చినప్పుడు, తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని నిలదీశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీలను కలిసి, పార్లమెంటులో చట్టం చేసేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిస్తే ఏ బిల్లు ఆగదని ఆయన హితవు పలికారు.

పోరాటాలు తీవ్రతరం చేస్తాం: ఆర్ కష్ణయ్య

బీసీ రిజర్వేషన్ల సాధించేవరకు పోరాటాలను ఆపేది లేదని, రానున్న రోజుల్లో బీసీల పోరాటాలు తీవ్రతరం చేస్తామని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కష్ణయ్య హెచ్చరించారు. బర్కత్‌పుర బస్సు డిపో ఎదుట బీసీ జేఏసీ కో ఆర్డినేటర్ గుజ్జ కష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఆర్ కష్ణయ్య, బీజేపీ ఎమ్యెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఆర్ కష్ణయ్య మాట్లాడుతూ..

42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు రాష్ర్ట ప్రభుత్వం న్యాయపరంగా గట్టి ప్రయత్నాలు చేయాలని కోరారు. బీసీ రేజర్వేషన్లు సాధించే వరకు తమ ఉద్యమాలు నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు. పాయల్ శంకర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ ఇచ్చిందని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వంపైనే ఉందన్నారు. 

బంద్‌తోనైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలి: జాజుల 

ఎంజీబీఎస్ వద్ద బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. ఈ బంద్ ద్వారనైనా బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కళ్లు తెరవాలన్నారు. 42 శాతం సాధించేవరకు తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని రగిలిస్తామని హెచ్చరించారు.

తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, అవ సరమైతే బీసీ రిజర్వేషన్లు ఆమోదించే వరకు ప్రధాని రాష్ర్టపతి భవన్ వద్ద సీఎం ధర్నా చేపట్టాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమ శక్తుల సహకారంతో బంద్ విజయవంతం అ య్యిందని ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో జేఏసీలో చర్చించి బీసీ రథయాత్రను అన్ని జిల్లాల్లో చేపట్టి హైదరాబాదులో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.

ఢిల్లీపై ఒత్తిడి పెంచడానికి ప్రత్యేక రైళ్ల ద్వారా ఢిల్లీకి వెళ్లి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బంద్ తోనైనా కేంద్ర ప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్‌లో రిజర్వేషన్లను చేర్చి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

డ్రామాలు ఆడుతున్నారు: మంత్రి కొండా సురేఖ

రేతిఫైల్ బస్టాండ్ వద్ద నిరసనలో మంత్రి కొండా సురేఖ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌తో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ కిరికిరి వల్లే రాష్ర్టంలో బీసీ రిజర్వేషన్ల అమలు ఆగిపోయిందని అన్నారు. చట్ట సభల్లో బిల్లు పెట్టి అమో దించామని, ఆర్డినెన్స్ జారీ చేశామని తెలిపారు. గవర్నర్ ఒక్క సంతకం పెట్టి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేదని చెప్పారు.

బిల్లును ఆపాలనే కుట్రతోనే కేంద్రానికి పంపారని విమర్శించారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన జీవోకు అడ్డుపడ్డారని ఆరోపించారు. మళ్లీ బీసీ బంద్‌లో బీజేపీ పాల్గొని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

త్వరలోనే అఫిడవిట్ దాఖలు చేస్తాం: మంత్రి పొన్నం 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తామని, హైకోర్ట్‌లో త్వరలోనే అఫిడవిట్ దాఖలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ నేతలతో కలిసి బీసీ ధర్నాలో పాల్గొని, మాట్లాడారు. గవర్నర్ వద్దకు తాము పంపిన బీసీ బిల్లు ఇంత వరకు ఆమోదం పొందలేదన్నారు.

బీసీ బిల్లుపై నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇక న్యాయ స్థానాల్లో పోరాటాలు చేస్తామని.. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల ఆకాంక్షలను కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయాలని సూచించారు. 

బీసీలను మోసం చేసేందుకు డ్రామాలు: తలసాని 

బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు వెనుకబడిన వర్గాలు సిద్ధంగా ఉన్నాయని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామని, దానిని గవర్నర్‌కు పంపారని, గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగానే ఆర్డినెన్స్, ఆ తర్వాత జీవో తీసుకొచ్చిందని విమర్శించారు.

బీసీలను మోసం చేయడానికి అనేక ద్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమ ఆత్మ గౌరవం కోసం మేము పోరాడుతున్నామని స్పష్టం చేశారు. తమ ఉద్యమం రానున్న రోజుల్లో మరింత ఉధృతం అవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్‌లో నిర్వహించిన ధర్నాలో అగ్రనాయకత్వం ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. 

హంతకుడే నివాళులు అర్పించినట్లుంది: కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలతో కలిసి అధ్యక్షురాలు కవిత ఖైరతాబాద్‌లో మానవహారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు కూడా వచ్చి బంద్‌లో పాల్గొనడం హంతకుడే నివాళులు అర్పించినట్టు ఉన్నదన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రతి ఇంటి నుంచి పోరాడాలి అని పిలుపునిచ్చారు.

మాకున్నంత చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు: మహేశ్‌కుమార్‌గౌడ్

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీసీ బంద్‌కు మద్దతుగా అంబర్‌పేట్ కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ బంద్‌లో మంత్రులందరూ పాల్గొన్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమకు ఉన్నంత చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదన్నారు. రాష్ర్టంలో శాస్త్రీయంగా కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో ఇచ్చాయని అన్నారు.

దురదష్టవశాత్తు ఆ జీవోపై స్టే విధించిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి.. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తాము త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ప్రధాని మోదీని కలుస్తామని చెప్పారు. ప్రభుత్వ పరంగా 42 బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు వెళ్లాలని చూస్తున్నామని.. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 

కిందపడిపోయిన వీహెచ్

అంబర్‌పేట్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అస్వస్థతకు గురై కిందపడిపోయా రు. తమ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి అంబర్‌పేట్‌లో హనుమంతరావు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో వీహెచ్ నడుస్తూ ఒక్కసారిగా అస్వస్థతకు గురై కిందపడిపోయారు. నేతలు ఆయనను పైకి లేపారు. ఇటీవలే వీహెచ్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, “ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మేం అడ్డుపడలేదు, మా రిజర్వేషన్లకు ఎందుకు అడ్డుపడుతున్నారు. మీకోసం 8 శాతం రిజర్వేషన్లు పెడితే మేము అడ్డుపడ్డామా అని ప్రశ్నించారు. మేము ఓబీసీ అని చెప్పుకునే వాళ్ల చిత్తశుద్ధి ఇదేనా? అని నిలదీశారు.

బీసీలకు ఇప్పుడు 42% రిజర్వేషన్లు రాకపోతే జీవితంలో ఇంకెప్పుడూ రావు అని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ఓబీసీ ప్రధాని ఓ అడుగు ముందుకు వేయాలని వీహెచ్ కోరారు. షెడ్యూల్ 9లో చేర్చి బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.