calender_icon.png 19 October, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17 నుంచి రాష్ట్రవ్యాప్త చైతన్య రథయాత్ర

17-10-2025 12:23:51 AM

టీపీఆర్‌పీ అధ్యక్షుడు జిలుకర రవికుమార్

ముషీరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ (టీపీఆర్‌పీ) తొలి వార్షికోత్సవం సందర్భం గా ఈనెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో చైతన్య రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిలుకర రవికుమార్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక కార్యకర్త కర్రేటి విజయ రెడ్డి టిపిఆర్ పిలో చేరింది. పార్టీ కార్యాలయంలో నాయకులు విశ్రాంత ఐఐఎస్ అధికారి కూనపు రెడ్డి హరిప్రసాద్‌తో కలసి ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

అనంతరం వారు మాట్లాడుతూ కొత్త రాజకీయ చైత న్యం అవినీతి లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ఈ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని, బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయిస్తామని వారు తెలిపారు.