calender_icon.png 21 September, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలయ్ బలయ్‌కు రండి

21-09-2025 12:00:00 AM

నాగార్జునను ఆహ్వానించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): అక్టోబర్ 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించ తలపెట్టే  అలాయ్ బలాయ్- 2025 కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ప్రముఖ సినీ నటుడు నిర్మాత అక్కినేని నాగార్జునను శనివారం బంజారా హిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి బొకేను అందజేసి సాధారంగా ఆహ్వానించినట్లు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.

అలాయ్ బలాయ్ ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టే అలాయ్ బలాయ్ కార్యక్రమానికి తప్పనిసరిగా ఆయ న విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలాయ్ బలాయ్ ఫౌండేషన్ చైర్మ న్ బండారు విజయలక్ష్మి పాల్గొన్నారు.