calender_icon.png 21 September, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాము కాటుకు బాలుడి మృతి

21-09-2025 12:00:00 AM

-నిద్రిస్తున్న సమయంలో కాటు వేసిన వైనం  

-కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్‌లో ఘటన

కామారెడ్డి, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): నిద్రిస్తున్న బాలుడిని పాము కాటు వేసి ప్రాణా లు తీసిన ఉదంతం ఇది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన గంగుల రాజమణి తన మూడేళ్ల కుమారుడు భాస్కర్ ను తీసుకొని తల్లిగారి ఊరు మహమ్మద్‌నగర్‌కు గురువారం వచ్చింది. రాత్రి నిద్ర పోతున్న సమయంలో భాస్కర్‌ను పాము కాటు వేసిం ది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొం దుతూ శనివారం మృతి చెందినట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. బాలుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.