calender_icon.png 21 September, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ హోదాతో శంకుస్థాపనలు చేస్తున్నవ్?

21-09-2025 12:00:00 AM

  1. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంపై ఎమ్మెల్యే యాదయ్య ఫైర్
  2. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్
  3. కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి

చేవెళ్ల, సెప్టెంబర్ 20: ఏ హోదాతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నావని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంను ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రశ్నించారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తన ల్యాడ్స్ నుంచి నిధులివ్వడం సంతోషమని, అయితే  మాజీ ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టడం ఏంటని నిలదీశారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రూ.65,67,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే చేసిన పైరవీ కారుడనే ఆరోపణలకు కౌంటర్ ఇచ్చా రు. చేవెళ్ల ప్రజలకు నిధులు తెచ్చేందుకు పైరవీలే చేశానే తప్ప... నీ లాగా రిసా ర్ట్స్, ఫామ్ హౌసుల్లో పైసల కోసం పైరవీలు చేయలేదని స్పష్టం చేశారు.  గత పదేళ్లలో నియో జకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని సవాల్ విరిసారు. 

మూడు మండలా లను మున్సిపాలిటీగా మార్చానని, ఈసీ, మూసీ వాగులపై ఎన్నో వంతెనలు నిర్మించానని చెప్పారు. 20 ఏళ్లుగా ముందుకు సాగని బీజాపూర్ హైవే పనులు వచ్చే నెలలో ప్రారంభబోతున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం పరిగి ఎమ్మెల్యే రామ్మెహన్ రెడ్డితో కలిసి పర్యాణవేత్తలతో చర్చలు జరి పి, ఎన్జీటీలో కేసు వెకేట్ చేయించేందుకు కృ షి చేశానని, గ్రామాలకు వెళ్లే రోడ్లకు రీబీటీ చేయడంతో పాటు అవసమైన చోట డబుల్ లైన్‌గా మారుస్తున్నామని, అన్ని గ్రామాల్లో సీ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. చేవెళ్ల మండల కేంద్రం లో కొత్త బస్ స్టేషన్ నిర్మించానని, గత ప్రభుత్వంలో నిధులు లేక ఆగిపోయిన బస్ డిపో పనులకు కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 

తనపై విమర్శలు తగవు..

కేవలం రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్లు వేయించి తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తనను పార్టీ మారానని అంటున్న రత్నం.. 2014లో టిడిపిలో గెలిచి 2018 లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎన్నికల ముందు 2023లో బీజేపీలోకి ఇలా నాలుగు సార్లు పార్టీ మారాడని,  తర్వాత ఏ పార్టీలోకి  పోతాడో తెలియదని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలో ఉన్నారని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బీఆర్‌ఎస్ లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి, మొయినాబాద్ మాజీ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, సీనియర్ నేత మర్పల్లి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్, మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వీరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బ్యాగరి రాములు, నేతలు టేకులపల్లి శ్రీనివాస్, గుండాల రాములు, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.