సీఎంపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
- కవితకు హిట్లర్ రాజ్యంగా కనిపిస్తుందా?
- కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): తెలంగాణలో రామరాజ్యం నడు స్తుంటే కవితకు హిట్లర్ రాజ్యం ఎలా కనిపిస్తుం దో అర్థం కావడం లేద ని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. సీ ఎం రేవంత్‌రెడ్డి కర్కోటకుడని కవిత చేసిన వ్యా ఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశా రు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్‌లో ప్రభుత్వంలో పదవులు అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డిపైన విమర్శలు చేయడం సరికాదన్నారు.
లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లిన ప్పుడు బీఆర్‌ఎస్ వాళ్లు సరిగా స్పందించలేదనే కవిత ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిం దన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్ర యాణం, రేషన్ ద్వారా సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక పథకాల అమలు కవితకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వంలో ఎవరికి అన్యా యం జరగనీయమని, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించామని తెలిపారు.
పార్టీ లో క్రమశిక్షణ తప్పితే చర్యలుంటాయన్నా రు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, పార్టీ ఇన్‌చార్జ్ ఝాన్సీరెడ్డిల ఫిర్యాదు మే రకు హరిప్రసాద్, కృష్ణ కిషోర్‌కు షోకాజ్ నో టీసులు ఇచ్చామని, పది రోజుల్లో వివరణ ఇవ్వాలన్నామన్నారు.






