దోస్త్ రెండో విడుతలోనూ కామర్సే టాప్
- కామర్స్‌లో 14,012 సీట్ల కేటాయింపు
సెకండ్ ఫేజ్‌లో 41,533 సీట్లు భర్తీ
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రెండో విడుత సీట్లను అభ్యర్థులకు అధికారులు కేటాయించారు. రెండో విడుతలో మొత్తం 41,533 మందికి సీట్లు కేటాయించారు. మొదటి ప్రాధాన్యం ద్వారా సీట్లు పొందిన అభ్యర్థులు 28,838. రెండు, ఇతర ప్రాధాన్యం ద్వారా సీట్లు పొందినవారు 12,695 మంది ఉన్నారు. రెండో విడుతలో వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసిన అభ్యర్థులు 44,803 మంది ఉన్నారు. రెండో విడుత ల్లోనూ కామర్స్ కోర్సునే ఎక్కువ మంది ఎం చుకున్నారు.
మొత్తం 41,533 మంది సీట్లు పొందగా, వీరిలో 14,012 మంది కామర్స్ కోర్సునే ఎంచుకున్నారు. మొదటి, రెండు విడుతల్లో కలిపి 1,17,823 సీట్లను కేటాయించారు. రెండో విడుత అభ్యర్థులు ఈ నెల 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని సూచించారు. ఇక జూన్ 6న మొదటి విడుతలో 76,290 మం దికి సీట్లను కేటాయించగా, వీరిలో 28,655 మంది కామర్స్ కోర్సును ఎంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,066 డిగ్రీ కాలేజీలుండగా, వాటి లో 135 ప్రభుత్వ, 86 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలున్నాయి. వాటి లో వివిధ కోర్సులకు సంబంధించి మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నా యి. గతేడాదిలో 3,89,049 డిగ్రీ సీట్లు అం దుబాటులో ఉండగా, వాటిలో 2.05 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
నేటి నుంచి మూడో దశ..
దోస్త్ మూడో విడుత షెడ్యూల్‌ను ప్రకటించారు. 19వ తేదీ నుంచి జూలై 2 వరకు మూడో విడుత రిజిస్ట్రేషన్ ప్రక్రియ, 6న మూడో విడుత సీట్లను కేటాయిస్తారు. జూలై 15 నుంచి ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.






