calender_icon.png 14 November, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుపై పులి దాడి

01-12-2024 01:38:46 AM

  1. మంచిర్యాల దవాఖానకు తరలింపు
  2. సిర్పూర్(టి) మండలం దుబ్బగూలో ఘటన

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): జిల్లాలో పులుల దాడులు కొనసాగుతున్నాయి. కాగజ్‌నగర్ మండలంలో శుక్రవారం జరిగిన దాడిలో మహిళ మృతి చెందగా.. చేనులో పనిచేస్తున్న రైతుపై పులి దాడి చేసిన ఘటన సిర్పూర్(టి) మండలం దుబ్బగూడ సమీపంలో శనివారం చోటుచేసుకున్నది. ఘటనకు సంబంధించిన వివరాలిలా.. రైతు సురేశ్  తన పొలంలో పనిచేసుకుంటుండగా వెనుక నుంచి పులి దాడి చేసింది.

అక్కడున్న వారంతా కేకలు వేయడంతో పులి పారిపోగా.. సురేశ్ మెడపై తీవ్ర గాయమైంది. దీంతో అతడిని సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం కాగజ్‌నగర్‌కు తరలించారు. పరిస్థితి విషమిం చడంతో వైద్యుల సలహా మేరకు మంచిర్యాలకు తరలించారు. సమీప 15 గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించి పులి కదలికలపై డ్రోన్లతో నిఘా ఉంచారు.

అదేవిధంగా అటవీశాఖ అధికారులు బోనులు, కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈస్‌గాం, నజ్రుల్‌న గర్, సీతానగర్, అనుకొడ, గన్నారం, కడం బ, ఆరెగూడ, బాబునగర్‌తో పాటు సిర్పూ ర్, పెంచికల్‌పేట్, కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

లక్ష్మి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా 

రూ.పది లక్షలు ప్రకటించిన మంత్రి సురేఖ 

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫా బాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారంలో శుక్రవారం జరిగిన పులిదాడిలో లక్ష్మి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, గ్రామస్థు లు ఆందోళన చేశారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ప్రకటించారు.

నష్టపరిహా రంతో పాటు వారి అవసరాల మేరకు సహకారం అందిస్తామని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం సిర్పూర్ (టి) మండలం దుబ్బ గూడెంలో రైతు సురేశ్‌పై పులి దాడి చేసిన ఘటనపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎఫ్‌వో నీరజ్‌తో మాట్లాడి రైతు పరిస్థితిపై ఆరా తీశారు.