21-11-2025 10:05:07 PM
ఘన వ్యర్ధాల నిర్వహణ పార్కును సందర్శించిన కమిషనర్ శైలజ
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఎ.శైలజ ఘన వ్యర్థాల నిర్వహణ పార్కును శుక్రవారం సందర్శించి,కొనసాగుతున్న వ్యర్థాల ప్రాసెసింగ్ కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ... బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిత్యం 78 స్వచ్చ ఆటోల ద్వారా చెత్తను సేకరించడం జరుగుతున్నది. కాని ఇట్టి స్వచ్చ ఆటోలకు తడి,పొడి చెత్తను కలిపి అందచేయడం వలన డంపింగ్ యార్డ్ కు వచ్చే చెత్త ఎక్కువ మొత్తంలో రావడంతో చెత్త నిర్వహణ,రవాణా చేయడం సమస్యగా మారడంతో పాటు, డంపింగ్ యార్డ్ త్వరగా నిండుతుంది.
కావున కాలనీ వాసులకు,రెసిడేన్శియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు పొడి చెత్త ను వేరు చేసి ఇచ్చే విధముగా ప్రజలకు అవగాహన కల్పించి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ తెలంగాణ,స్వచ్ఛ భారత్ కొరకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమములో అసిస్టెంట్ కమీషనర్ శ్యాం సుందర్ రావు, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నిఖిల్, డంపింగ్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.