calender_icon.png 21 November, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి చోరవతో మంథని మాత శిశు ఆస్పత్రిలో గైనిక్ సేవలు పునః ప్రారంభం

21-11-2025 09:56:45 PM

జిల్లా సూపరింటెండెంట్ శ్రీధర్

మంథని,(విజయక్రాంతి): మంథని మాత శిశు ఆసుపత్రిలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో గైనిక్  సేవలు పునః ప్రారంభించామని *జిల్లా సూపరింటెండెంట్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా సూపరింటెండెంట్ శ్రీధర్ ప్రత్యేక చొరవతో మంథని ఆసుపత్రిలో గైనిక్ సేవలను పునర్ ప్రారంభించామని, మంథని డివిజన్ గ్రామాల్లోని గర్భిణీలు దూర ప్రాంతాల వెళ్లకుండా డబ్బులు వృధా చేసుకోకుండా  మంథని పరిసర ప్రాంతాల గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు.