17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సత్తా చాటిన కమిషనరేట్ పోలీస్ సిబ్బంది

24-02-2026 01:34 AM

కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): గతవారం రోజులుగా సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నాల్గవ పోలీస్ స్పోరట్స్ మీట్లోనిర్వహించిన క్రీడా పోటీల్లో కరీంనగర్ కమిషనరేట్ పోలీస్ అధికారులు, సిబ్బంది 9 స్వర్ణ, 13 రజత, 13 కాంస్య పతకాలు, మొత్తం 35 పతకాలను కైవసం చేసుకున్నారు.

ఏసిపి మాధవి టేబుల్ టెన్నిస్లో 2 స్వర్ణ పతకాలు, బాడ్మింటన్లో రజత, యోగాలో కాంస్య, ఇన్స్పెక్టర్ జి. రవి కిరణ్ 45+ బాడ్మింటన్లో కాంస్య, 45+ సింగిల్ షటిల్లో రజత,  ఎ. స్వప్న ఆర్మ్ రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ (డబుల్స్), టేబుల్ టెన్నిస్ (టీమ్) విభాగాల్లో మొత్తం 3 స్వర్ణ, ఎల్. శ్రీజ టేబుల్ టెన్నిస్ (డబుల్స్), టేబుల్ టెన్నిస్ (టీమ్) విభాగాల్లో 2 స్వర్ణ, టేబుల్ టెన్నిస్ (సింగిల్స్) లో రజత పతకం సాధించారు.

శ్రీధర్ స్విమ్మింగ్ పోటీల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్, జె. సాయి దీప్ వాటర్ స్పోరట్స్ విభాగంలో ఒక స్వర్ణ, ఒక కాంస్య, ఎండి సోహైల్ రెజ్లింగ్ (కుస్తీ) కాంస్య, ఎం. అరుణ  పవర్ లిఫ్టింగ్ రజత, కె. గౌతమి ప్రసన్, ఎల్. జయ కబడ్డీ కాంస్య, డి. బాలకృష్ణ, ఎ. శంకర్ యోగాలో చెరో 2 రజత, ఎండి సల్మాన్ అలీ జూడోలో కాంస్య, మల్లేష్ 45+ బాడ్మింటన్ కాంస్య, డి. రాజు డిస్కస్ త్రో రజత, వై. రవి కుమార్ ఆర్మ్ పవర్ లిఫ్టింగ్ రజత, కె. గణేష్ బాడీ బిల్డింగ్ రజత, ఎ. తిరుపతి హ్యామర్ త్రో రజత, పి. ఉమారాణి టేబుల్ టెన్నిస్లో ఒక కాంస్య, షటిల్లో 3 కాంస్య పతకాలు సాధించారు. విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల పట్ల అంకితభావం ప్రదర్శించి పతకాలు సాధించిన క్రీడాకారులను కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయాలు శాఖలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని సిపి పేర్కొన్నారు.