05-01-2026 12:00:00 AM
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా
మణుగూరు, జనవరి 4 (విజయక్రాంతి) : పేదలు, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి, కార్మికులు,కర్షకుల, హక్కుల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిరంతరం పోరాడుతుందని, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. ఈనె ల 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభ విజయవంతం కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం ప్రచారజాత నిర్వహించి, సిపిఐ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ముందుగా రాజ్యాంగ నిర్మాత బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి సాబీర్ పాషా పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఖమ్మం నగరంలో ఐదు లక్షల మందితో జరిగే పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయ కులు కల్లూరి వెంకటేశ్వరరావు, సరెడ్డి పుల్లారెడ్డి, మహిళా సమైక్య జిల్లా కార్య దర్శి మున్నా లక్ష్మి కుమారి, దుర్గ్యాల సుధాకర్, సాంబాయిగూడెం సర్పంచ్ చీడెం ఉషారాణి, రామాను జవరం సర్పంచ్ బడిశా కల్పన, ఉపసర్పం చ్ పులిగల రమేష్, మాజీ సర్పం చ్ బడిశా సతీష్, లక్ష్మీనారాయణ, రాంగోపాల్, ఏడారి రమేష్, మల్లికార్జున్, కుటుంబ రావు, వెంకటేశ్వర్లు, వీరయ్య,సమ్మక్క, సుజా త నిర్మల, ప్రజానాట్యమండి కళాకారులు పాల్గొన్నారు.
చమురుకోసమే అమెరికా దాడులు సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 4 (విజయక్రాంతి): ఆయిల్ నిక్షేపాల కోసమే వెనిజు లపై అమెరికా సామ్రాజ్యవాద దాడికి పాల్పడుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక మంచికంటి భవన్లో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనిజులాపై బాంబుదాడులు అమెరికా సాగించిన సామ్రాజ్యవాద ఉగ్రవాద దాడి అని అన్నా రు.
వెనిజులా అధ్యక్షుడు మధురో అతని భా ర్యను కిడ్నాప్ చేసామని ట్రంప్ స్వయంగా ప్రకటించాడని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎజె రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు రేపాకుల శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ నాయకులు కాళంగి హరికృష్ణ నందిపాటి రమేష్ పాల్గొన్నారు.