07-01-2026 09:56:45 AM
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేత(Demolition encroachments) ఘర్షణలకు దారితీసింది. ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్(Delhi Ramlila Maidan) ప్రాంతంలో రాత్రి ఆక్రమణలను కూల్చివేశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో మున్సిపల్ అధికారులు ఆక్రమణల కూల్చివేత చేపట్టారు. తుర్క్‌మన్ గేట్(Turkman Gate), సయ్యద్ ఫైజ్ ఎలాహి మసీదు వద్ద ఆక్రమనిర్మాణాలను కూల్చివేవారు. కూల్చివేతల ప్రాంతానికి దాదాపు 150 మంది ఆందోళన కారులు వచ్చారు. ఆక్రమణల కూల్చివేతను(Demolition) వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారుల దాడుల్లో ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. అధికారులు నచ్చజెప్పడంతో పలువురు ఆందోళన కారులు వెనుదిరిగారు. కొందరు ఆందోళన కారులు(Protesters) రాళ్ల దాడికి పాల్పడ్డారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయులు ప్రయోగించారు. సీసీటీ ఫుటేజీ, బాడీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తిస్తున్నారు. దాడులకు పాల్పడిన పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆక్రమణల కూల్చివేతల ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.