calender_icon.png 8 January, 2026 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ ఖమ్మం పర్యటన రోజే.. బీఆర్‌ఎస్‌కు భారీ షాక్

07-01-2026 10:38:47 AM

హైదరాబాద్: ఖమ్మం కార్పొరేషన్(Khammam Corporation) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (KTR Khammam visit) ఖమ్మం పర్యటన రోజే బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. సర్పంచుల సన్మాన కార్యక్రమం కోసం కేటీఆర్ ఖమ్మం బయలుదేరారు. ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో సర్పంచుల అభినందన సభ ఏర్పాటు చేశారు. ఖమ్మం పురపాలికల ఎన్నికల సన్నద్ధతపై కేటీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

కేటీఆర్ పర్యటన రోజే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ షాక్ ఇస్తోంది. మరో ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు(BRS corporators) ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రెండ్రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఖమ్మం నగరపాలక సంస్థలో కాంగ్రెస్ బలం 40కి పెరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు బుధవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(Chief Minister Revanth Reddy) కలవనున్నారు. సీఎంతో భేటీలో ఖమ్మం కార్పొరేషన్ ముందస్తు ఎన్నికలపై స్పష్టత రానుంది.