07-01-2026 11:10:33 AM
హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లాలో(Nagarkurnool District) పరారీలో ఉన్న అంతర్రాష్ట్ర దొంగ నాగిరెడ్డి(Nagireddy Arrested) పట్టుకున్నారు. నవంబర్ 13న కల్వకుర్తి పోలీస్ స్టేషన్ నుంచి నాగిరెడ్డి పరారయ్యాడు. తెలుగు నాగిరెడ్డి అలియాస్ మల్లెపూల నాగిరెడ్డి చోరీ కేసులో అరెస్టు అయ్యాడు. విచారణ కోసం జైలు నుంచి పోలీసులు కల్వకుర్తి పోలీస్ స్టేషన్(Kalwakurthy Police Station)కు తీసుకువచ్చారు. బహిర్భూమికని చెప్పి స్టేషన్ బాత్ రూం నుంచి నాగిరెడ్డి పారిపోయాడు. నాగిరెడ్డి పరారీ ఘటనలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. నాగిరెడ్డి పరారీ ఘటనలో ఎస్ఐకి ఛార్జ్ మెమోచ హోంగార్డు అటాచ్ చేశారు. మంగళవారం రాత్రి నాగిరెడ్డిని సీసీఎస్ పోలీసులు(CCS police) హైదరాబాద్ లో పట్టుకున్నారు. నాగిరెడ్డి నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం వీరాపూర్ కు చెందిన వాడు. నాగిరెడ్డిపై వందకు పైగా దొంగతనం కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.