07-01-2026 10:05:26 AM
కోనసీమ: బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని(ONGC Gas leak) ఇరుసుమండలో బ్లోఅవుట్ అదుపులోకి రాలేదని అధికారులు వెల్లడించారు. పి.గన్నవరం మండలం ఇరుసుమండలో మూడోరోజు మంటలు ఎగిసిపడుతున్నాయి. గూడవల్లి కాలువ(Goodavalli Canal) నీటితో మంటలార్పేందుకు ఓఎన్జీసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటల తీవ్రత తగ్గినా.. నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. విదేశీ నిఫుణులతో మంటలను నియంత్రించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరో ఐదు రోజుల పాటు మంటలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 5న ఇరుసుమండలో ఓఎన్జీసీ బావిలో గ్యాస్ లీకై భారీ ఎత్తున మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. గుబ్బలపాలెం, లక్కవరం పునరావాస కేంద్రాల నుంచి స్థానికులు ఇళ్లకు చేరుకున్నారు. భయాందోళన చెందవద్దని అధికారులు స్థానికులకు భరోసా కల్పించారు.