calender_icon.png 26 December, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సీపీఐ శతజయంతి ఉత్సవాలు

26-12-2025 05:14:55 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి):  భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు బెల్లంపల్లి లో ఘనంగా జరిపారు. శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం (బాసెట్టి గంగారం విజ్ఞాన్ భవన్) లో సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ కార్యదర్శి ఆడెపు రాజమౌళి పతాక ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడుతూ ఈ దేశంలో 1925 సంవత్సరం డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఎంఎన్ రాయ్, ఏ వల్లన్ రాయ్, అబాని ముఖర్జీ, రోసాపిటo గోన్, మహమ్మద్ అలీ, మహమ్మద్ షఫిక్  నాయకత్వంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందన్నారు. ఆవిర్భావ తొలి జనరల్ సెక్రెటరీగా ఎస్వీ గాటే  ఎన్నికయ్యారని తెలిపారు.

ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో సీపీఐ ప్రముఖ పాత్ర పోషించిదన్నారు. తెలంగాణలో నైజాముకు వ్యతిరేకంగా దొరల దోపిడీకి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దున్నే వాడికి భూమి చెందాలని , కార్మిక  చట్టాల గురించి, పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేకమైన పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉన్నదన్నారు. కేంద్రంలో మతోన్మాద బిజెపి ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను బడా పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తున్నదని మండిపడ్డారు. సంపన్నులను మరింతగా సంపన్నులను చేస్తూ పేదలను నిరుపేదలుగా మారుస్తూ ప్రజాకంటక ప్రభుత్వంగా తయారయిందనీ ధ్వజమెత్తారు.

ఈ పాసిస్తూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతర ప్రజా పోరాటాలు చేయవలసి ఉన్నదన్నారు. సీపీఐ కి నేటికీ 100 సంవత్సరాలు అవుతున్నందునా దేశమంతా  ఉత్సవాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహకార దర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, మండల కార్యదర్శి బొందల లక్ష్మీనారాయణ, బీకేయంయు జాతీయ సమితి సభ్యులు అక్కపెళ్లి బాబు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు బొల్లం సోని, జిల్లా సమితి సభ్యులు రత్నంరాజం, నాయకులు బొంకూర్ రామచందర్, బండారి శంకర్, సమ్మయ్య, మహేందర్ రెడ్డి, తిరుపతి, శంకర్ గౌడ్, ఇనుముల రాయమల్లు, కలువల రాయమల్లు, శనిగారపు జక్కయ్య, స్వామిదాస్, అందుగుల రాజేందర్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.