26-12-2025 06:20:46 PM
వెంకంపాడు గ్రామపంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి
డీసీసీ డైరెక్టర్ చాపల యాదగిరిరెడ్డి
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వెంకంపాడు గ్రామపంచాయతీలో గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని డిసిసి డైరెక్టర్ మరిపెడ సొసైటీ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి అన్నారు. వెంకంపాడు పాకాల చెరువు కట్టకు ఇరువైపులా పిచ్చి చెట్లను తొలగించే కార్యక్రమాన్ని వెంకంపాడు గ్రామపంచాయతీ యువ సర్పంచ్ ఉప్పల చిన్న సోమన్న ఎన్నికలో ఇచ్చిన మాట ప్రకారం... డిసిసి డైరెక్టర్ మరిపెడ సొసైటీ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ప్రతి గ్రామంలో యువకుల తోటే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి సర్పంచ్ ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం తమ వంతు కృషి చేయాలన్నారు.