calender_icon.png 26 December, 2025 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొడవను అడ్డుకున్న తండ్రి, కొడుకులపై హత్యాయత్నం

26-12-2025 06:16:05 PM

చికిత్స పొందుతూ తండ్రి మృతి

వివరాలు వెల్లడించిన డిఐజి, ఎస్పి

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యలాల్ మండలం పరిధిలో ఇందిరమ్మ కాలనీ గత రాత్రి జరిగిన హత్య  వివరాలను  డిఐజి, ఎల్ఎస్ చౌహన్, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మీడియాతో వెల్లడించారు. తాండూరు మండలం ఖంజాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి కిట్టు అనే వ్యక్తి, ఓ అమ్మాయి విషయాల్లో పాత కక్షలు ఉన్నాయని దీంతో గోపాల్ కత్తితో కిట్టును హత్య చేసేందుకు వెంబడించగా 

ప్రాణ భయంతో పరిగెత్తుకుంటూ రాజీవ్ కాలనీ నూరు అహ్మద్ కు చెందిన బీఫ్ షాప్ లో తలదాచుకునగా షాప్ యజమాని గొడవెందుకు పడుతున్నారని వారించాడు దీంతో కోపోద్రిక్తుడైన గోపాల్ నూర్హమ్మద్ ను కత్తితో కడుపులో పొడిచాడు. అడ్డుకున్న అతని కుమారుడు ఆబ్బు ను సైతం కత్తితో దాడి చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నూర్ అహ్మద్ కు తీవ్ర గాయం కావడంతో  చికిత్స కోసం హైదరాబాద్ నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం పోలీస్ బందోబస్తు మధ్య నూర్ అహ్మద్  అంత్యక్రియలు నేడు పూర్తయ్యాయి. మరోవైపు తాండూర్ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  భారీ బందోబస్తు ఏర్పాటు  చేశారు. నేరానికి కారకులైన ఏ1 గోపాల్, ఏ2 ఆదర్శ్, 3 అనిల్, 4 ప్రవీణ్ రెడ్డి, 5 కృష్ణ, 6 ప్రశాంత్ రెడ్డి  లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని వారు తెలిపారు.. గొడవలు వద్దన్న పాపానికి నిండు ప్రాణం బలి కావడంతో కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.