calender_icon.png 26 December, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సప్త శక్తి సంఘం మహిళల్లో చైతన్య జ్యోతి కార్యక్రమం

26-12-2025 06:12:08 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా సప్తశక్తి సంఘం పేరుతో మహిళా చైతన్య కార్యక్రమం శుక్రవారం శ్రీ సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 250 మందికి పైగా మహిళల హాజరై ఉత్సాహాన్ని నింపారు. ముఖ్య అతిథిగా డాక్టర్ ఆకుల శైలజ, కార్యక్రమ అధ్యక్షులుగా సముద్రాల ప్రణీత రాణి, సన్మాన గ్రహీతలుగా తోట సునీత, సిరికొండ పుష్పలత,ముఖ్య వక్తలుగా అలివేలు మంగ, వాణి సక్కుబాయి పాల్గొన్నారు. వాణి సక్కుబాయి గారు  సందేశం ఇస్తూ  భారతదేశ పురోగతిలో మహిళల పాత్ర అనితర సాధ్యమని పేర్కొన్నారు.

మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వడం, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అవసరమని తెలిపారు. కుటుంబం నుంచి సమాజం వరకు మహిళలు చేసే సేవలు, కృషి దేశ అభివృద్ధికి పునాది లాంటివని తెలియజేశారు. శ్రీమతి అలివేలు మంగ  మాట్లాడుతూ... రోజువారి జీవితంలో కుటుంబం పర్యావరణహిత చర్యలు అవలంబించడం, భూమి వనరులను సంరక్షించడం, ప్రకృతిని కాపాడే అలవాటులను అభివృద్ధి చేసుకోవడం భవిష్యత్తు తరాలకు అందించాల్సిన గొప్ప బహుమతి అని పేర్కొన్నారు.