calender_icon.png 26 December, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ అభివృద్ధికి మంత్రులు సహకరించాలని సర్పంచుల వినతి

26-12-2025 06:44:28 PM

కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలంలోని పలు గ్రామాల సర్పంచులు శుక్రవారం రాష్ట్ర మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్‌గౌడ్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని వెలికట్ట గ్రామ సర్పంచ్ బూర్గుల మానస సురేందర్ రావు, జప్తి నాచారం గ్రామ సర్పంచ్ లక్కిరెడ్డి పావని శశిధర్ రెడ్డి మంత్రులను కలిసి తమ గ్రామాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచులను మంత్రులు శాలువాలతో సత్కరించి అభినందించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ పరంగా తగిన సహకారం అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు సర్పంచులు తెలిపారు.