calender_icon.png 26 December, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిస్టు ఉద్యమాలతోనే పేదలకు న్యాయం

26-12-2025 05:17:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): దేశంలో కమ్యూనిస్టుల ఉద్యమాలతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి విలాస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. జెండాను ఎగురవేసి కమ్యూనిస్టు పార్టీ పేద వర్గాల కోసం చేసిన పోరాటాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్ ఎన్ రెడ్డి బుక్ కె రమేష్ భీమ్ రెడ్డి ముత్యం పద్మ కుమారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు