26-12-2025 04:29:49 PM
నిర్మల్,(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని విశ్రాంతిభవనంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కిషన్ ముదిరాజ్ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముదిరాజుల హక్కుల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటాన్ని సంఘ నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఏటాకరి సాయన్న బోండ్ల గంగాధర్ పోతన్న తదితరులు ఉన్నారు