26-12-2025 06:28:24 PM
కుభీర్,(విజయక్రాంతి): కుభీర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పల్సి గ్రామంలో శుక్రవారం గొర్రెలు, మేకలకు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో మూగ జీవాలకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుభీర్ సర్పంచ్ కందూరి సాయినాథ్ యాదవ్ గొర్రెలు, పశువులకు ఉచిత నట్టల నివారణ మందులు వేశారు.
వైద్యుడు విశ్వజిత్ పటేల్, సిబ్బంది గ్రామంలోని 1200 గొర్రెలు, మేకలకు మందు వేసినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కుభీర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ సాయినాథ్ ను శాలువా, పూల మాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.