calender_icon.png 26 December, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాభివృద్ధిలో సర్పంచులే కీలకం

26-12-2025 06:32:20 PM

ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 

శివుని తండా లో సర్పంచ్ విజయోత్సవ సభ

ఊరు ఊరంతా కలిసి ఎమ్మెల్యే కు స్వాగతం పలికిన గ్రామస్తులు 

కుభీర్,(విజయక్రాంతి): గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర ఎంతో కీలకమైనదని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం కుభీర్ మండలం లోని శివుని తండాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విజయోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సేవ చేయాలన్న తపన కలిగిన ప్రతి సర్పంచ్ తన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరు.

కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం వెచ్చించే నిధులను సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, పల్లె బాటలు, జిపి బిల్డింగులు, వ్యవసాయ క్షేత్రాలకు మట్టి రోడ్లు తదితర పనులను చేపట్టి గ్రామ అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషించాలని సూచించారు.  అంతకుముందు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో పాటు గిరిజన తండా వాసులు తరలివచ్చి ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. భాజా భజంత్రీలు, మంగళ హారతులతో ఆయనను వేదిక పైకి తీసుకెళ్లారు.

అక్కడ జగదంబ సేవాలాల్ ఆలయాల్లో ఆయన పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి తారు రోడ్డు,  సిగ్నల్ సురేఖ తండాలు పడుతున్న ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం  బిఎస్ఎన్ఎల్ లేదా ఎయిర్టెల్, జియో లాంటి ఏదో ఒక టవర్ ను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాథోడ్ దేవుకాబాయి విశాల్, బీజెపి మండల అధ్యక్షుడు ఏశాల దత్తాత్రి, నాయకులు వడ్డం నాగేశ్వర్, సాంవ్లీ రమేష్, రాథోడ్ శంకర్, గులాబ్ నాయక్, జాదవ్ గణపతి, వెంకట్రావు పటేల్ బిజెపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.