31 March, 2026 | 2:16 AM

మెడికవర్‌లో అరుదైన చికిత్స

31-03-2026 12:47 AM

తెగిపోయిన చేతి భాగాన్ని విజయవంతంగా అమర్చిన వైద్యులు

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాం తి) : సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తాలోని మెడికవర్ హాస్పిటల్స్‌లో వైద్యులు అత్యంత క్లిష్టమైన మైక్రోసర్జరీ ద్వారా దాదాపు పూర్తి గా తెగిపోయిన ఎడమ చేతి ముందుభాగా న్ని (ఫోర్ ఆర్మ్) విజయవంతంగా మళ్లీ అమ ర్చి రోగి చేతిని కాపాడారు. మల్లేష్ ప్రమాదానికి గురై ఎడమ చేతి ముందుభాగం దాదా పు పూర్తిగా తెగిపోవడంతో అత్యవసర విభాగానికి చేరుకున్నారు.

చేతి భాగం కేవలం చి న్న మృదుల కణజాలంతో మాత్రమే అనుసంధానమై ఉండగా, ప్రధాన రక్తనాళాలు, నరాలు, టెండన్లు, రెండు ఎముకలు దెబ్బతిన్నాయి. ట్రామా సర్జరీ బృందం (ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్) శస్త్రచికిత్స ప్రారంభించిం ది.7 గంటల పాటు సాగిన  శస్త్రచికిత్సలో ఎ ముకలను ప్లేటింగ్ ద్వారా స్థిరపర్చడం, అ ల్నార్ ఆర్టరీ, రెండు వీన్లను మరమ్మత్తు చేసి రక్తప్రసరణను పునరుద్ధరించడం, టెండన్ల పునర్నిర్మాణం, నరాల సూక్ష్మ మరమ్మ త్తు చేపట్టారు.

శస్త్రచికిత్స అనంతరం చేతిలో రక్తప్రసరణ సక్రమంగా కొనసాగతుండటం, చేతి వేడిగా ఉండటం, మంచి క్యాపిలరీ రీఫి ల్ కనిపించడం లక్షణాలు గమనించబడ్డా యి. ప్రస్తుతం రోగి స్థిరంగా ఉండి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. భవిష్యత్తులో పూర్తి పనితీరు కోసం దశలవారీ రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ నిర్వహించనున్నారు. శస్త్ర చికిత్స ప్లాస్టిక్ సర్జన్ డా. కె.అభినవ్ కుమార్ నే తృత్వంలో డా.శ్రీనివాస్, అనస్థీషియా బృం దం కలిసి విజయవంతంగా నిర్వహించారు.