calender_icon.png 13 June, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలిగొండ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటాపోటీగా దరఖాస్తు

12-06-2025 06:38:48 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధ్యక్ష పదవికి పలువురు ఆశావాహులు పోటా పోటీగా దరఖాస్తు చేసుకున్నారు. వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం పాశం సత్తిరెడ్డి గత 10 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా, మండల, గ్రామ అధ్యక్షులను ఎన్నుకోవాలని ఉద్దేశంతో చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వలిగొండ మండలం కేంద్రంలోని శివ సాయి ఫంక్షన్ హాల్ లో మంగళవారం జిల్లా కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో వలిగొండ మండల అధ్యక్షుడు పదవికి దరఖాస్తుల స్వీకరణ నిర్వహించారు.

దీంతో మండల అధ్యక్షుడి పదవి కోసం పలువురు మంగళవారం, బుధవారం దరఖాస్తులు అందజేసినట్లు తెలుస్తుంది. దరఖాస్తులు అందజేసిన వారిలో పాశం సత్తిరెడ్డి, ఉలిపే మల్లేశం, చెరుకు శివయ్య గౌడ్, జక్క జంగారెడ్డి, పాలకూర వెంకటేశం, వంగాల అశోక్, బెలిదే నాగేశ్వర్, బద్దం సంజీవరెడ్డి, బత్తిని సత్యనారాయణతో పాటు మరికొంతమంది కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి భారీ పోటీ నెలకొన్నట్లు కనిపిస్తుంది. అయితే భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్వగ్రామమైన వలిగొండ మండలం అధ్యక్ష పదవికి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధ్యక్ష పదవి ఎంపిక ఏ విధంగా ఉండనుంధోనని సర్వత్ర ఉత్కంఠత నెలకొంది.