12-11-2025 12:31:33 AM
అశ్వాపురం, నవంబర్ 11: అశ్వాపురం మండలంలోని రెండు ప్రైవేట్ పాఠశాలలు ఎమిలీ పబ్లిక్ స్కూల్ మరియు ఎక్సలెంట్ స్కూల్స్ లో సరైన వసతులు కల్పించకుండా, అవసరమైన ధృవపత్రాలు లేకుండానే పాఠశాలలను నడుపుతున్నట్లు మాల మహానాడు జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శి కాల్వ సంసోను, మేకల భాస్కర్ బుధవారం మండల విద్యాశాఖ అధికారి జి. వీరస్వామి ని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ రెండు పాఠశాలలు ఏ ఆధారాలతో, ఎలాంటి అనుమతులతో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నాయనే వివరాలను అధికారికంగా వెల్లడించాలని, సంబంధిత రికార్డులను పరిశీలించాలని వారు కోరారు. విద్యార్థుల భద్రత, ప్రమాణాలు, మౌలిక వసతులపై స్పష్టమైన నివేదిక వెలువడే వరకు ఈ అంశంపై మరింత పరిశీలన కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.