12-11-2025 12:29:48 AM
జిల్లా యువజన, క్రీడల అధికారి సునీల్ రెడ్డి
ఖమ్మం టౌన్, నవంబర్ 11(విజయ క్రాంతి): జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రం లో మంగళవారం ఘనంగా నిర్వహించినట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి తుంబూరు సునీల్ రెడ్డి అన్నారు. 29 వ జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలను 850 మంది యువ కళాకారులతో జిల్లా స్థాయి కళాకారుల ఎంపికలను విజయవంతంగా నిర్వహించినట్లు యువజన, క్రీడల అధికారి అన్నారు.
స్వామీ వివేకానంద చిత్రపటానికి పూల మాలలతో అలంకరించి, జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించారు. జానపద నృత్యం గ్రూప్ ఫోక్ డ్యాన్స్, జానపద గేయాలు గ్రూప్ ఫోక్ సాంగ్, వ్యాస రచన, పోస్టర్ తయారీ, వ్రకృత్వ పోటీలు, కవిత్వం, ఇన్నోవేషన్ మొదలగు అంశాలలో ప్రదర్శనలు పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఆర్. ఉదయ్ కుమార్, న్యాయ నిర్ణేతలు విచ్చేసిన జాన్, మాలతీ నాయుడు , ఎస్‌ఆర్ అండ్ బిజీఎన్‌ఆర్ లెక్చరర్లు కే. రవికుమార్, ఐ. కిరణ్ కుమార్, కే. మధు, బి. శ్రీనివాస్, జి. వీరన్న, యువజన సంఘాల సమితి అధ్యక్షులు ఉమాశంకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.