శ్మశానవాటిక కబ్జా ప్రజావాణిలో ఫిర్యాదు
మేడ్చల్, జూన్ 29 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో ని ముకుంద సినిమా థియేటర్ వెనుక, రైల్వే స్టేషన్ సమీపంలో 1117 సర్వే నంబర్ లోని స్మశాన వాటికను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని బిజెపి సీనియర్ నాయకులు చెరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్మశాన వాటిక పక్కనే ఉన్న ప్లాట్ల నంబర్ తో బై నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత స్మశాన వాటిక రూపురేఖలు, హద్దులు తొలగించి ప్లాట్ ల నంబర్లతో హద్దురాళ్ళు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు స్మశాన వాటిక హద్దులను ఏర్పాటు చేయాలని, రిజిస్ట్రేషన్ లను రద్దు చేయాలని ఆయన కోరారు. ఫిర్యాదు తో పాటు లేఅవుట్ జిరాక్స్ కాపీ, ఫోటోలను అధికారులకు అందజేశారు.






