20-12-2025 12:39:47 AM
చెన్నూర్, డిసెంబర్ 19 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొండంపేట ఎన్నిక ఫలితాల్లో తారుమారు జరిగినట్లు సర్పంచ్ అభ్యర్థి నీల సంతోషి గ్రామస్తులతో కలిసి శుక్ర వారం ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను పోటీలో ఉండగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో తప్పుడు ఫలితాలు ప్రకటించారని ఆరోపించారు.
రీ కౌంటింగ్ కు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ నుంచి పోటీచేసిన అభ్యర్థిని గెలుపొందినట్లు ప్రకటించార న్నారు. అధికారులు ఏకపక్షంగా ఉండి కొండంపేట సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో తారుమారు చేశారని, ఇప్పటికైనా అధికారులు రీకౌంటింగ్ జరిపించి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై ఆర్డీవోకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.