మియాపూర్ సర్కిల్ ప్రజావాణిలో 13 ఫిర్యాదులు
అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి 12అర్జీలు
శేరిలింగంపల్లి, జూన్ 22 (విజయక్రాంతి): మియాపూర్ సర్కిల్ 48లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ విభాగాలకు సంబంధించి 13 ఫిర్యాదులు అందాయి.అధికారులు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.వచ్చిన 13 ఫిర్యాదుల్లో టౌన్ ప్లానింగ్ విభాగానికి 12 అర్జీలు అందగా, ఇంజనీరింగ్ విభాగానికి 1 ఫిర్యాదు వచ్చింది. రెవెన్యూ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, యూసీడీ, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, వెటర్నరీ విభాగాలకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.
అర్జీదారులందరితో అధికారులు ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. టౌన్ ప్లానింగ్ సంబంధిత ఫిర్యాదులపై వెంటనే చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా ఫిర్యాదులపై చర్యలు తీసుకుని అర్జీదారులకు తెలియజేయాలని స్పష్టం చేశారు.ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడం ద్వారానే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని తెలిపారు.






