23 June, 2026 | 1:05 AM

మహిళా సాధికారతకు టాస్క్ దోస్తీ

23-06-2026 12:27 AM

రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌హెచ్‌జీ మహిళలకు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్, ఆర్థిక అక్షరాస్యత శిక్షణలు

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి అవకాశాల పెంపే లక్ష్యంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్), సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) దోస్తీ కట్టాయి. ఈ మేరకు సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ ఒప్పందాన్ని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, టాస్క్ సీఈఓ కే నితిన్‌కుమార్‌రెడ్డి పరస్పరం మార్చుకు న్నారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ భాగస్వామ్యాన్ని ప్రారంభించా రు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు బ్యాం కింగ్ కరస్పాండెంట్ సేవలకు సంబంధించిన నైపుణ్యాలు, డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, వ్యాపార నిర్వహణ, వ్యవస్థాపకత అభి వృద్ధి, స్థిరమైన జీవనోపాధి అవకాశాలపై ప్రత్యేక శిక్షణలు అందించనున్నారు.

ఈ దిశగా టాస్క్ తన శిక్షణా నైపుణ్యాన్ని, సెర్ప్ తన విస్తృ త గ్రామీణ నెట్‌వర్క్ వినియోగించి మహిళలకు సమర్థవంతమైన శిక్షణ అందించనుంది. మహిళల సమగ్ర అభివృద్ధి, ఆర్థిక సాధికారత, సమాజంలో వారి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో టాస్క్ భాగస్వా మ్యం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎన్ రెడ్డి, వీరమల్లు, ఇరు సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.