23 June, 2026 | 1:05 AM

మైదానాల వైపు అడుగులు వేయండి

23-06-2026 12:22 AM
  1. సింథటిక్ ట్రాక్ రూ 12.53 కోట్ల నిర్మాణం శంకుస్థాపన చేసిన 
  2. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం 

మహబూబ్ నగర్, జూన్ 22 (విజయ క్రాంతి) : యువత మేధానాలవైపు అడుగులు వేసి క్రీడల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహబూబ్నగర్   జిల్లా క్రీడా మైదానంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో  సుమారు  రూ 12.53 కోట్ల( సింథటిక్ ట్రాక్ 10.70 కోట్లు, నాలుగు ఓపెన్ జిమ్స్  రూ 1 కోటి , ఇండోర్ జిమ్ రూ 51 లక్షలు, మహిళల అథ్లెటిక్స్ హాస్టల్ కోసం రూ 32 లక్షలు)  వ్యయంతో పలు ఆధునిక క్రీడా సదుపాయాల నిర్మాణానికి ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా 400 మీటర్ల 8 లైన్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. క్రీడాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం చేసి మహబూబ్ నగర్ కు మంజూరు చేసిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.  నాడు అడిగిన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు.  జిల్లాలో క్రీడల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. 

వాలీబాల్, కబడ్డీ  అకాడమీతో పాటు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.  జిల్లాను క్రీడల రంగంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దడమే కాకుండా ఒలింపిక్ క్రీడలలో దేశం తరుపున ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించేలా క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ ఇప్పించే ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాబోయే రోజుల్లో  దేశంలోనే క్రీడా రంగంలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. 

 ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో వారి జీవనశైలిలు మార్చే శక్తివంతమైన సాధనం క్రీడారంగానికి ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్న ఈ ట్రాక్ ద్వారా జిల్లాలోని యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి శిక్షణ అందే అవకాశం కలుగనుందని,  ఈ సదుపాయాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు సమానంగా ఉపయోగపడేలా రూపొందిస్తున్నారు. 

అన్ని రంగాలలో నగరాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకుపోయేందుకు శాహాయశక్తులుగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో  డిల్లీ లో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి & తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎపి జితేంధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్  ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీడి జానకి,  మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి,  మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, కర్పొరేటర్ ఉమర్ కొత్వాల్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు , డివైఎస్‌ఓ రాజశేఖర్ రెడ్డి,  అధికారులు తదితరులు పాల్గొన్నారు.