calender_icon.png 18 November, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ ప్రజావాణిలో 20 ఫిర్యాదులు

18-11-2025 12:00:00 AM

 సమస్యలను పరిష్కరించవలసిందిగా సీపీ సాయి చైతన్య ఆదేశం 

నిజామాబాద్, నవంబర్ 17 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ చేపట్టిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి మంచి లభిస్తోంది. సోమవారం నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి తమ సమస్యలపై 20 దరఖాస్తులు వచ్చాయి. ప్రజల సమస్యల విన్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జిల్లాలోని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఫోన్ ద్వారా స్థానికుల సమస్యలను వివరించి పరిష్కారాన్ని సూచిస్తూ వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించిన కమిషనర్ సాయి చైతన్య వెంటనే స్పందించారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలకు టావు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సిపి ప్రజలకు సూచించారు. ప్రజల సమస్యను చట్ట ప్రకారం పరిష్కరించేందుకు తమ సిబ్బంది ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందన్నారు

ప్రజలకు పోలీసులు మరింత దగ్గర అయ్యేలా శాంతి భద్రతాలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని సిపి సాయి చైతన్య స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి సోమవారం ప్రజల నుండి నేరుగా వారి సమస్యల పరిష్కారాని  కై అర్జీలను ప్రజల నుండి స్వీకరిస్తున్నారు.