17-11-2025 11:50:04 PM
మలక్‌పేట్ (విజయక్రాంతి): సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మలక్‌పేట్‌కు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. సౌదీలోని పవిత్ర ఉమ్రా యాత్రను నిర్వహించేందుకు వెళ్లిన 45 మంది యాత్రికులు ఉన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో అందులోని వారందరూ సజీవ దహనమయ్యారు. మలక్‌పేట్‌లోని ముసరాంబాగ్ డివిజన్‌కు చెందిన తల్లి కూతుర్లు అమీనా బేగం, అనీష్ ఫాతిమా సౌదీలోని బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల ముసరాంబాగ్‌కు చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యుల్లోని ముగ్గురిని వెంటనే సౌదీకి చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.