బాధితుల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలి
మంచిర్యాల, జూన్ 18 (విజయక్రాంతి): న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించే బాధితుల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని రామగుండం సీపీ శ్రీనివాసు లు ఆదేశించారు. మంగళవారం కమిషనరేట్‌లో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్‌తో కలిసి మంచిర్యాల జోన్ పరిధిలోని ఏసీపీలు, సీఐలు, పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని, వారికి న్యాయం చేయగలమనే నమ్మకాన్ని కల్పించాలని సూచించారు. అండర్ ఇన్వెస్టిగేషన్(యూఐ) కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలని అన్నారు.
ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై నిఘా ఉంచాలని, సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన డబ్బులను త్వరగా బాధితులకు ఇప్పించేలా చూడాలన్నారు. ల్యాండ్ కేసులు, సివిల్ కేసులలో ఎస్‌ఓపీ ప్రకారం పారదర్శంగా ఇన్వెసిటగేషన్ చేయాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచి ఏసీపీ రాఘవేంద్రరావు, ఏసీపీలు ప్రకాశ్ (మంచిర్యాల), వెంకటేశ్వర్లు (జైపూర్), రవికుమార్ (బెల్లంపల్లి), ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు ఇతర అధికారులు పాల్గొన్నారు.






