20 May, 2026 | 7:11 PM

పురుడు పోసిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానం

19-06-2024 01:11 AM
  • అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 

కరీంనగర్, జూన్ 18 (విజయక్రాంతి): కరీంనగర్‌లో బస్టాండ్‌కు వచ్చి పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు ఆదివారం ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సైదమ్మ, రేణుక, భవాని, లావణ్య పురుడు పోశారు. తల్లీబిడ్డను సురక్షితంగా కాపాడారు. మేనేజర్ నోముల అంజయ్య వారికి సహాయ సహకారాలు అందించారు. వారిని మంగళవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సన్మానించారు. కార్యక్రమంలో ఆర్టీసీ జోన్ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ సి.వినోద్‌కుమార్, రీజినల్ మేనేజర్ ఎన్.సుచరిత, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు, ఎస్.భూపతిరెడ్డి, కె.సత్యనారాయణ, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రజనీ కృష్ణ పాల్గొన్నారు.