calender_icon.png 8 August, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యర్థాలు, చెత్త సమస్యలపై వాట్సాప్‌లో ఫిర్యాదు

02-08-2025 02:19:23 AM

  1. సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి సమస్యలపై నగర పౌరులు తక్షణమే ఫిర్యాదు చేయగలగే విధంగా ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ణు ఏర్పాటు చేసినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ వెల్లడించారు. ఇంతకు ముందు మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది. అయితే సమస్యలపై మరింత వేగంగా స్పందించేందుకు ఇప్పుడు వాట్సాప్ నంబర్ 81259 66586 ను ప్రారంభించామని ఆయన తెలిపారు.

పౌరులు తమ ప్రాంతంలో ఎదురవు తున్న భవన నిర్మాణ వ్యర్థాలు, గార్బేజ్ బిన్ ఓవర్‌ఫ్లో జివిపి పాయింట్‌ల వద్ద పేరుకొని పోయిన చెత్త  తొలగింపు వంటి సమస్యల ఫోటోలు, లొకేషన్ వివరాలు ఈ నంబర్‌కు పంపించవచ్చు. ఇలా వచ్చిన ఫిర్యాదులను అధికారులు తక్షణమే పరిష్కారం చూపుతారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రజలు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు.