calender_icon.png 8 August, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలు చదువుకుంటే సీఎం ఓరుస్తలేడు

02-08-2025 02:20:34 AM

  1. అందుకే ఇంటిగ్రేటెడ్ పేరుతో గురుకులాల నిర్వీర్యం
  2. ఎంపీ ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఆకర్షణీయమైన పేరుతో బీసీ గురుకులాలన్నీ రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. కార్పొరేట్ విద్య పేరిట గురుకులాలు లేకుం డా చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు బీసీలపై చిత్తశుద్ధి లేనే లేదని.. అందుకే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీపై బురదజల్లి తప్పించుకోవాలనే కుట్ర చేస్తుందని ఆరోపించారు.

శుక్రవారం బీజేపీ రాష్ర్ట కార్యాల యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీజేపీ ఆధ్వర్యం లో ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు.

42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ మద్దతు ప్రకటించిందని.. హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీకే చిత్తశుద్ధి లేదన్నారు. రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణల ప్రకారం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ర్ట ప్రభు త్వాలదేనని.. 243డి (6) క్లాజ్‌లో దీన్ని స్పష్టంగా పేర్కొన్నారని కృష్ణయ్య చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే పూర్తి అవకాశం ఉందని.. అసెంబ్లీలో బిల్లు పాస్ అయిందని, ఇప్పుడు జీవో జారీ చేయాల్సిన పని మాత్రమే మిగిలిందన్నారు. కానీ కోర్టు అడ్డుకుంటున్నదని, బీజేపీ అడ్డుకుంటున్నదని చెప్తూ కాంగ్రెస్ నేతలు బుకాయిస్తున్నారని ఆయన విమర్శించారు.