02-08-2025 02:19:02 AM
ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్
కుత్బుల్లాపూర్, ఆగష్టు 1 (విజయ క్రాంతి): పేద ప్రజల హృదయాలను గెలుచుకున్న ప్రజా నాయకులు కూన వెంకటేష్ గౌడ్ అని బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 - గాజుల రామారం డివిజన్ పరిధిలోని కె.వి.ఎస్ కన్వెన్షన్ లో ఏర్పాటుచేసిన కూన వెంకటేష్ గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై కూన వెంకటేష్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ నిరాడంబరుడు, పేదల పాలిటి పెన్నిధి కూన వెంకటేష్ గౌడ్ అని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలతో పేదల అభ్యున్నతికై కృషిచేసిన నేత కూన వెంకటేష్ గౌడ్ ప్రజల గుండెల్లో కలకాలం ఉంటారన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, బిఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, గుబ్బల లక్ష్మీనారాయణ, మూసా ఖాన్, ఇమ్రాన్ బేగ్, చెట్ల వెంకటేష్, సమ్మయ్య యాదవ్, హమీద్, శివా నాయక్, జునైద్, ప్రసాద్, వాహీద్, గుబ్బల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.