16-10-2025 02:22:52 AM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపెల్లి, అక్టోబర్ 16 విజయ క్రాంతి) పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్న అంగన్వాడి సెంటర్లకు ఒకే మాడల్ లో కొత్త భవనాలను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. బుధవారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో పెద్దపల్లి నియోజకవర్గంలోని 305 అంగన్వాడి సెంటర్లకు సంబంధించి టీచర్లకు, ఆయాలకు కొత్తగా డ్రెస్ కోడ్ రెండు జతల వస్త్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా గ్రామాల్లో అంగన్వాడి భవనాల సమస్యలు ఉన్నాయని సెంటర్లలో పిల్లలకు టీచర్లు, ఆయాలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఇంట్లో తల్లి తల్లితో సమానంగా వీరు పిల్లల పట్ల అంకితభావంతో సేవలు అందిస్తున్నారని, పిల్లలకు ఒకవైపు నర్సరీ విద్యను అందిస్తూనే మరోవైపు మంచి పోషకాలతో ఉన్న పదార్థాలను ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.
గర్భిణీలకు, బాలింతలకు రెండు ఏళ్లుగా ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నట్టు చెప్పారు. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలను సైతం ’బాలామృతం’ అందిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేస్తూ పూర్తి పారదర్శకంగా అంగన్వాడి సేవలను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్త డ్రెస్ కోడ్ వస్త్రాలను అందించడం జరుగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిడిపిఓ, పాల్గొన్నారు.